తారాగణం- ధనంజయ, అమృత అయ్యంగార్, రంగాయణ రఘు, పూర్ణచంద్ర, విజయ ప్రసాద్, తార
సాంకేతిక సిబ్బందిః నిర్మాత- సావిత్రమ్మ అడవి స్వామి, గుజ్జల్ పురుషోత్తం, రిజ్వాన్, సంగీతం-వాసుకి వైభవ్, సినిమాటోగ్రఫీ-ప్రీతమ్ జయరామన్, దర్శకుడు- శంకర్ గురు
ఈ శుక్రవారం తెలుగు స్ట్రెయిట్ సినిమాలతోపాటు కన్నడ నుంచి డబ్బింగ్ అయిన సినిమా బడవ రాస్కెల్. కన్నడలో 50రోజులు ఆడింది. రామ్‌గోపాల్ వర్మ చేసిన భైరవగీత సినిమా ద్వారా పరిచయం అయిన ధనంజయ ఇందులో కథానాయకుడు. ఇటీవలే పుష్పలో నెగెటివ్ రోల్ లో గుర్తింపు పొందాడు. ఈ కథ మధ్యతరగతి యువకుడి కథ అని ముందుగానే చెప్పాశారు. ఈ చిత్రాన్ని తెలుగులో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలైంది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథాంశం:
ఆటో డ్రైవర్ కొడుకు శంకర్ (ధనంజయ). ఎం.బి.ఎ. చేసిన ఒక మధ్యతరగతి కుర్రాడు. తండ్రి ఆటోను కూడా నడుపుతుంటాడు. స్నేహితులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ క్రమంలో శంకర్ ఓ గొప్పింటి అమ్మాయి సంగీత (అమృత అయ్యంగార్)ను ప్రేమిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. దాంతో ఆటోను నడవద్దని చెబుతుంది. శంకర్ అందుకు ఒప్పుకోడు. ఆ తర్వాత తను శంకర్‌ను తిరస్కరిస్తుంది. ఆ తర్వాత శంకర్ ను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇతన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఆ తర్వాత కథ ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఇది వినడానికి రొటీన్ ఫార్మెట్‌లో వుండే కథ. ధనుంజయ్ తన శైలిలో మధ్యతరగతి యూత్‌ను కనెక్ట్ చేసేలా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లోకూ బాగా చేశాడు. ముఖ్యంగా అమృత అయ్యంగార్‌తో రొమాంటిక్ సన్నివేశాలలోనూ రంగాయణ రఘు, తారలతో భావోద్వేగ సన్నివేశాలలో అతని నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాగే అమృత అయ్యంగార్, నాగభూషణ, పూర్ణచంద్ర మైసూర్ నటన కూడా చెప్పుకోదగినది. శంకర్ తల్లిదండ్రులుగా తార, రంగాయణ రఘు బాగా నటించారు.
మహిళా దర్శకురాలు ప్రీతా జయరామన్ సినిమాటోగ్రాఫర్‌గా మెచ్చుకోదగినట్లుగా వుంది. సంభాషణపరంగా పంచ్ డైలాగ్‌లు బాగా కుదిరాయి. ఉడిపి హోటల్, ఆగగా నేనపగుతాలే వంటి పాటలు ఆకట్టుకునే టైటిల్ ట్రాక్‌ని అలరించేట్లుగా వాసుకి వైభవ్‌కి బాణీలు సమకూర్చాడు. ధనుంజయ్ స్నేహితుడైన దర్శకుడు శంకర్ గురు తన తొలి చిత్రంలోనే ఒక మార్క్‌ను మిగిల్చాడు. ఫస్ట్ హాఫ్‌లో కథనం బాగున్నా, సెకండాఫ్‌లో మందగించింది. కథ, కథనాలను మరింత వేగంగా తెరమీద చూపించి ఉంటే డిఫినెట్‌గా మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అయి ఉండేది. ఫస్టాఫ్ వేగంగానే సాగినప్పటికీ.. సెకండాఫ్ మరీ సాగదీతగా అనిపిస్తుంది. కానీ విడి విడిగా తల్లి, కొడుకు, తండ్రి కొడుకు మధ్య ఉండే సెంటిమెంట్ హృదయానికి హత్తుకొంటుంది. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా.. ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
డాలీ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుంజయ్ ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రిజ్వాన్ విడుదల చేశారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌కు తగినట్టుగా తెలుగులో రిచ్ క్వాలిటీస్‌తో బడవ రాస్కెల్‌ను రిలీజ్ చేశారు.