చాందిని చౌద‌రి న‌టించిన యేవ‌మ్ ఎలా వుందంటే.. రివ్యూ

డీవీ

శుక్రవారం, 14 జూన్ 2024 (16:35 IST)
Chandini Chaudhary Yevam
నటీనటులు: చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, జై భ‌ర‌త్ రాజ్, అషు రెడ్డి తదిత‌రుల
 సాంకేతికత: సినిమాటోగ్రఫీ: ఎస్వి. విశ్వేశ్వ‌ర్, సంగీత దర్శకుడు: కీర్త‌న శేష్, నీలేష్ మాండ‌లపు,  ఎడిటింగ్: సృజ‌న అడుసుమిల్లి. నిర్మాతలు : న‌వ‌దీప్, ప‌వ‌న్ గోప‌రాజు, దర్శకుడు: ప్ర‌కాశ్ దంతులూరి
 
చాందిని చౌద‌రి న‌టించిన తాజా చిత్రం ‘యేవ‌మ్’.  నేడు విడుదలయింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా టైటిల్ కొంచెం కన్ ప్యూజ్ గా వున్నా.. సంస్క్రుత పదాన్ని టైటిల్ గా దర్శకుడు పెట్టాడు. ఇది ఇలా జరిగింది అనే అర్థమే ఏవం అంటే.. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థ:
వికారాబాద్ పరిసర్లాలో యుగంధ‌ర్ (వశిష్ట సింహా)  ఫేక్ ఐడీతో అమ్మాయిలను ట్రాప్ చేసి మర్డర్లు చేస్తుంటాడు. ఆ టైంలో సౌమ్య‌(చాందిని చౌద‌రి) స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ గా వికారాబాద్ పోలీస్ స్టేష‌న్ లో జాయిన్ అవుతుంది. అక్కడ అభిరామ్ (జై భ‌ర‌త్ రాజ్) సి.ఐ.. ఎప్పుడూ సీరియస్ గా వుండే అభిరామ్.. సౌమ్యకు రికార్డింగ్ రూమ్ లో పని చేయిస్తాడు. కానీ ఆడవాళ్ళు కూడా మగాళ్ళతో సమానమే అనే తరహా గల సౌమ్య మర్డర్ కేసు పరిశోధనలో ఇన్ వాల్వ్ అయి అభిరామ్ మెప్పు పొందుతుంది.
 
ఆ తర్వాత జరిగిన కొన్ని సన్నివేశాలతో అభిరామ్ లో కొత్త కోణాలు కనిపిస్తాయి. ఈ క‌థ‌లో హారిక‌(అషు రెడ్డి) పాత్ర ఏమిటి ? అస‌లు యుగంధ‌ర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు? చివరికి ఏమయింది? అనేది మిగిలిన భాగం.
 
సమీక్ష:
ఇలాంటి మర్డర్ నేపథ్యం వున్న కథలకు సంగీతం చాలా కీలకం. అది ఏవమ్ లో కనిపిస్తుంది. ఇక నటనాపరంగా  చాందిని చౌద‌రి,  జై భ‌ర‌త్ రాజ్ కూడా త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. వ‌శిష్ట సింహా నెగెటివ్ రోల్ కు న్యాయం చేశాడు. అయితే ఇలాంటి కథలు చెప్పేటప్పుడు ఎక్కడికక్కడ ట్విస్ట్ లుండడంతోపాటు ముడి విప్పే క్రమంలో కూడా ట్విస్ట్ లువుంటే ఆసక్తిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో అదే ప్రధాన లోపం. 
 
సినిమా ప్రముఖు పేర్లను వాడుకుని అమ్మాయిలను ట్రాప్ చేసే విధానం కొత్తగా ఇందులో వున్న అంశం. అయితే ఆయా సన్నివేశాలకు తగిన విధంగా రాసుకున్నాడు దర్శకుడు. మెచ్చూర్డ్ పోలీసు ఆపీసర్ గా కనిపించే చాందిని ఆ వెంటనే తెలివితక్కువ పనిచేయడంతో క్యారెక్టర్ దిగిపోయింది. మొదట కాలేజీ అమ్మాయిని ట్రాప్ చేసేటప్పుడు కానీ, పోలీసుగా చాందిని వెళ్ళేటప్పుడు కానీ సరైన లాజిక్ లేకుండా దర్శకుడు చూపించడంతో కిక్ అనిపించదు. కొన్ని అన‌వ‌స‌ర‌పు షాట్స్, సాగదీసే సీన్స్ ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పిస్తాయి.
 
దర్శకుడు విదేశాల సినిమాల ప్రభావం వున్నా అందుకు తగిన విధంగా కథను మరింత జాగ్రత్తగా రాసుకుంటే బాగుండేది. హీరో నవదీప్ కూడా సి.స్పేస్ నిర్మాణ సంస్థను నెలకొల్పి ఓటీటీ మార్క్ ఫార్మెట్ ను సినిమా తీయడం సాహసమే. ఇక మొదటి భాగంలో ఏదో ట్విస్ట్ వుండబోతుంది అంటూనే సెకండాఫ్ లో సన్నివేశాలతో డ్రాప్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. 
    
రైట‌ర్, డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్ దంతులూరి ఇలాంటి థ్రిల్లర్ పై మరింత కసరత్తు చేస్తే బాగుండేది. కెమెరా, సంగీతం ఎంత బాగున్నా ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు కనెక్ట్ అయ్యే అంశాన్ని తీసుకోవాల్సింది. అది లోపించడంతో సాధార‌ణ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ గా నిలిచింది. విలన్ లో వుండే రెండు కోణాలు కామన్ మేన్ కు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. దీనిని మరింత ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. మొత్తంగా యేవమ్ కొందరికి నచ్చే చిత్రమని చెప్పవచ్చు.
రేటింగ్: 2.75/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు