చేగువేరా బ‌యోపిక్ - చే మూవీ రివ్యూ

శుక్రవారం, 15 డిశెంబరు 2023 (17:32 IST)
che poster
నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్..
సాంకేతికత:  కెమెరా: కళ్యాణ్ సమి, జగదీష్, ఎడిటర్: శివ శర్వాణి, సంగీత దర్శకుడు : రవిశంకర్, రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్, నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర, పీఆర్: దయ్యాల అశోక్
 
విప్లవకారుడు ఎలా వుండాలనేది క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో చూసి తెలుసుకోవచ్చు. అందుకే ఆయన్ను గురువుగా భావించి అణచివేస్తున్న పాలకుపై పోరాటం ఎలా చేయాలనే మెళుకువలను నేర్చుకుని మోటార్ బైక్ పైనే దేశాలన్నీ తిరిగిన యోదుడు చెగువేరా. చే అని ఆయన్ను అభిమానులు పిలుచుకుంటారు. ఆయన పోరాటం ప్రపంచాన్ని కదిలించింది. ఇండియాలోని కమ్యూనిస్టులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పాఠాలు చెబుతుంటారు. అలాంటి వీరుడి జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించిన మూవీ “చే” - లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. ఈ రోజే ఈ సినిమా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అయింది. మరి ఎలా వుందో చూద్దాం.
 
క‌థ‌:
ట్రైలర్ లో కథంతా చెప్పకుండా కొంచెం రుచి చూపించాడు. అసలు కథలోకి వెళితే, పీడిత‌ జ‌నాన్ని చైత‌న్య పరిచే చే (సభావత్ నాయక్) పోరాట పటిమతో ప‌లు దేశాలు తిరుగుతూ జ‌నాన్ని చైత‌న్య ప‌రుస్తుంటాడు. దాంతో ఓ రోజు పోలీసు కాల్పుల్లో గాయ‌ప‌డిన 'చే'ను  గిరిజ‌న గ్రామ‌స్తులు కాపాడుతారు. అందులో సింగి (లావణ్య) 'చే'ను ప్రేమిస్తుంది. కానీ చే మనసంతా ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం త‌దిత‌ర‌ సమస్యలపై పోరాటం చేయాలని అంటుంది. ఆ దిశగా ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్ర‌మంలో పోలీసుల చేతిలో త‌న ద‌ళ స‌భ్యులు చ‌నిపోతారు. చివ‌రికి  'చే' కూడా బొలీవియా సైనిక దళాలకు బందీగా చిక్కుతాడు. ఆ త‌ర్వాత ఏమైందీ? చేనుప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది? అనేదే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
చేగువేరా పాత్ర‌లో బిఆర్ సభావత్ నాయక్ సూటయ్యాడు. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు చేగువేరా ఎలా ఉంటాడో పూర్తిస్థాయిలో చూపించాడు. లీడ్ రోల్‌లో సభావత్ నాయక్ చెప్పిన డైలాగ్‌లు ఈ సినిమా హైలైట్ పాయింట్స్‌గా చెప్పుకోవ‌చ్చు. చే కు జంట‌గా న‌టించిన‌ లావణ్య త‌న పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన‌ పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్ త‌మ పరిది మేరకు పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు.
 
రవిశంకర్ అందించిన మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. మ్యూజిక్‌తో పాటు స‌రైన‌ కెమెరా కూడా సీన్లు హైటైట్ అయ్యేలా చేశాయి. డీవోపీ అందించిన‌ కళ్యాణ్ సమి, జగదీష్ ప‌నితీరు బాగుంది. ఎడింటింగ్ కు ఎడిటర్ శివ శర్వాణి  ఇంకాస్త పని పెట్టాల్సింది.
 
 చేగువేరా బ‌యోపిక్‌ అనగానే సినిమా రంగంలో చర్చ జరిగింది. అసలు సరిగ్గా తీయగలడా? అనే అనుమానం కలగక మానదు. కానీ చే పాత్రధారి తాను ఈ సినిమా కోసం బి.ఆర్ సభావత్ నాయక్ 20 ఏళ్లుగా త‌పించాన‌ని, తోపుడు బండిపై మ‌ర‌మ‌రాలు అమ్ముతూ పైసాపైసా కూడబెట్టి సినిమా తీశాన‌ని చెప్పడంతో సినిమాపై మరింత కేర్ ఏర్పడింది. చే లాగానే అసాధార‌ణ వ్య‌క్తి చ‌రిత్ర ఎలా తెర‌కెక్కిస్తాడో చూడాల‌న్న ఆస‌క్తి చాలామందిలో పెరిగిపోయింది. చేగువేరా జీవిత చ‌రిత్ర‌ను చిన్న‌ప్పుడే చ‌దివి, అనేక పుస్త‌కాల నుంచి ఎంతో స‌మాచారం తీసుకున్న‌ట్టు సభావత్ నాయక్ ఇప్ప‌టికే చెప్పారు. అందుకే సాధార‌ణ క‌థ‌తో పాటు, చేగువేరా లైఫ్ గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌ని విష‌యాల‌ను  కూడా ఎంతో ఆస‌క్తిగా తెర‌కెక్కించాడు దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్. సినిమాలోని పాత్ర‌లు ఇండియాలో మాదిరిగానే క‌నిపిస్తాయి.
 
పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ద పేదల బతుకులు మారవని గ్రహించాడు. అనుకున్నదే తడవు క్యూబన్‌ విప్లవ పోరాటంలో భాగస్వామ్యం వహించాడు. ఫిడల్‌ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవం విజయానికి వ్యూహరచన చేశాడు. కాంగోలో ఇతని దళంలోని విప్లవ వీరుల ప్రయత్నాలు విజయవంతం కాదు. ఎంతో మంది చ‌నిపోతారు. ఈ కారణంగా మధ్యలోనే చేగువేరా వెనుదిరగాల్సివచ్చింది. ఆ తరువాత బొలీవియా విముక్తి పోరాటంలో పాల్గొంటాడు. చివ‌రికి బొలీవియా సైనిక దళాలకు చేగువేరా బందీగా చిక్కుతాడు. అయినప్పటికీ తన ఆశయాల్ని చంపలేరని నినదిస్తాడు. చేగువేరా క‌థ‌ను పూర్తిస్థాయిలో న‌డిపించిన విధానం బాగుంది.
 
భారీ దర్శకుడు తీసినంగా కాకపోయినా తన పరిధిమేరకు దారి త‌ప్ప‌కుండా తాను రాసుకున్న‌ది తెర‌పై చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పొచ్చు. చేగువేరా చెప్పే మాటలు కూడా తూటాల్లా ఉంటాయ‌ని రాసుకున్నాడు సభావత్ నాయక్. చేగువేరా క్యూబా, లాటిన్ అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలో ఎన్నో దేశాలలో పోరాటాల‌కు స్ఫూర్తి అనే విష‌యాన్ని ఈ సినిమా ద్వారా సూటిగా చెప్పాడు డైరెక్ట‌ర్. 
 
కథనం ప్రకారం కొన్ని ఫ్రీడమ్ లున్నా ఓ దశలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చేగువేరాను గుర్తు చేస్తాడు. అదే స్ఫూర్తితో తీశాన‌ని డైరెక్ట‌ర్ బి.ఆర్ సభావత్ నాయక్ తెలిపాడు. ఇక చిన్నపాటి లోపాలున్నా దాన్ని అదిగమించేలా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అరుదైన‌ చ‌రిత్ర తెర‌పై చూసే అవ‌కాశం ఈ సినిమా క‌ల్పిస్తుంది. చరిత్ర గురించి తెలిసినవారు మరింత లోతుగా చే ను తెలుసుకునే ప్రయత్నం ఈ చిత్రం చేసింది.
రేటింగ్: 2.75 \ 5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు