ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సూట్ అయ్యారని, కామెడీ టైమింగ్ బాగుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫుల్ ఫన్ మూవీ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. లవ్ ట్రాక్ క్యూట్‌గా ఉంది.
ఈ సినిమాకు రావు రమేష్ పాత్ర ప్రధాన బలం. సెకండాఫ్ అంతా సరదాగా సాగుతుంది. అయితే మరికొంతమంది మాత్రం కథలో కొత్తదనం లేదని, పాతబడిపోయి డిజాస్టర్ అయిందని వాపోతున్నారు. ఇది సంపూర్ణేష్ బాబు సినిమాలా ఉందని, అన్ని సినిమాలకు స్పూఫ్‌లా ఉందని కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.