కాకపోతే యూనివర్సల్ కాన్సెప్ట్ తోపాటు అప్పటికే బాలీవుడ్ లో విడుదల తేదీ ప్రకటించడంతో అక్కడ క్రేజ్ వచ్చేసింది. ప్రమోషన్ లో వారికి అక్కడి వారు బ్రహ్మరథం పట్టారు. కానీ తెలుగులో థియేటర్ లు ఇవ్వలేదు. కనీసం వంద థియేటర్ లు ఉంటె 20 ఇవ్వమన్నా ఇవ్వలేదు. దాంతో అంతా హనుమంతుడి చూసుకుంటాడని ధైర్యంగా ఉన్నారు. ఇప్పడు అదే నిజమైంది.
అయినా, చిన్న హీరో సినిమా తప్పుకుంటే బెటర్ అని ఇన్ డైరెక్ట్ గా డీలా రాజు సూచించారు. దానికి తగినట్లు హనుమాన్ సినిమాను మైత్రీ మూవీస్ పంపిణీ చేస్తే అందుకు థియేటర్ కూడా పెద్దగా ఇవ్వలేదు. ఉన్న థియేటర్లలో గుంటూరు కారం వేశారని తెలియడంతో హనుమాన్ నిర్మాత, మైత్రీ మూవీస్ నిర్మాత మండలికి ఫిర్యాదు చేశారు.
విడుదలకు ముందు గుంటూరు కారం ఓపెనింగ్స్ బాగుంటే ప్రస్తుతం ఓటింగ్స్ పరంగా కూడా గుంటూరు కారం కి హను మాన్ చిత్రం సాలిడ్ పోటీ ఇస్తుండడం విశేషం.. సహజంగా ఓ స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే దాని తాలూకా బుకింగ్స్ కానీ ఓటింగ్స్ లో కానీ మొదటి రోజు కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా లక్షల్లో ఉంటాయి. ఒక మిడ్ రేంజ్ సినిమాగా వచ్చిన హను మాన్ కూడా 1 లక్షకి పై చిలుకు ఓటింగ్స్ రాబట్టగా గుంటూరు కారం కి కూడా లక్షకి పైగా రాబట్టింది.