ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారనీ, అచ్చం ఎన్టీఆర్‌లాగే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ క్రెడిట్ అంతా దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌కే దక్కుతుందని వారు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇకపోతే, సినిమాలోని దివిసీమ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించినట్టు ప్రకటించే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా, ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగులు, కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెబుతున్నారు. అయితే, చిత్రం తొలి అర్థభాగం కొంచెం సాగదీతగా అనిపించిందనీ, ఎన్టీఆర్ గెటప్‌లు ఎక్కువైపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ చిత్రం బాగానే ఉందని, బాలయ్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనని చెబుతున్నారు.