రవితేజ సినిమా అంటేనే మాస్ కథలుంటాయి. పక్కా మాస్‌తో డైలాగ్‌లు, యాక్షన్, సెంటిమెంట్ మిళితం చేస్తూ హీరోయిన్‌తో సాంగ్స్ మధ్యమధ్యలో కామెడీ వుంటుంది. ఇప్పుడు కూడా అదే ఫార్మెట్‌తో తీసిన సినిమా థమాకా. సినిమా చూపిస్తమామ దర్శకుడు త్రినాథ్‌రావు, రచయిత ప్రసన్న కలిసి చేస్తున్న జర్నీలో ఈ సినిమా ఒకటి. ఇది కొత్త కథకాదు. అప్పట్లో చిరంజీవి చేసిన రౌడీ అల్లుడు తరహాలో వుంటుందని ముందుగానే చెప్పడంతో కాపీ సినిమా తీశారని ప్రేక్షకుల్ని ముందుగానే మైండ్ సెట్ చేశారు. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
srileela, raviteja
కథగా చెప్పాలంటే.
ఆనంద్ చక్రవర్తి (రవి తేజ) తండ్రి చక్రవర్తి (సచిన్ ఖేడేఖర్). వీళ్లకు చెందిన పీపుల్స్ మార్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని మరో బిజినెస్ మేన్ జేపీ(జయరామ్) స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ఇదే కంపెనీకి సీఈవో కావాలని మరో వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు మధ్యతరగతి కుటుంబంలో నివసించే స్వామి (రవితేజ) భరణి కొడుకు. స్వామి సోదరి స్నేహితురాలు పావని (శ్రీలీల)ను రౌడీ మూకనుంచి కాపాడతాడు. తను ప్రేమిస్తున్నానని చెప్పేస్తాడు. అయితే, పావని తండ్రి రావురమేష్ తన స్నేహితుడైన చక్రవర్తి కొడుకు ఆనంద్‌కు ఇచ్చి పెండ్లి చేయాలని డిసైడ్ అయి అమ్మాయికి ఆనంద్‌ను పరిచయం చేస్తాడు. అయితే స్వామి, ఆనంద్ ఒకేలా వుండడంతో కన్‌ఫ్యూజ్ అయి ఎవరిని పెండ్లిచేసుకోవాలను టైంలో కొన్ని సినిమాటిక్ సంఘటనలు జరుగుతాయి. ఆనంద్‌ను జెపి చంపేస్తాడు. ఇక గతిలేక స్వామిని పెండ్లిచేసుకోవాలనుకున్న టైంలో ఓ నిజం తెలుస్తుంది. అది ఏమిటి? చివరికి జెపి. పాచికలు ఫలించాయా? ఆనంద్ కంపెనీలో రెండో సీఈవోగా వుండాలనుకున్న వ్యక్తి ఎవరు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ థమాకాలో కథంటూ ప్రత్యేకంగా ఏమీకనిపించదు. ముందుగానే చెప్పినట్లు రౌడీ అల్లుడు ఫార్మెట్. అయినా ఇందులో ఇంద్ర, అలవైకుంఠపురం, రాజా ది గ్రేట్ వంటి సినిమాలోని సీన్స్‌ను తీసుకుని డైలాగ్‌లు రాసి చూపించేశారు. ఇవి కొంతమంది ఆడియన్స్‌ను సరదాగా అనిపించవచ్చు. కానీ లాంగ్‌రన్‌లో ఈ సినిమా నిలబడడం కష్టం. మంచి సామాజిక అంశం పెద్ద హీరోతో చెప్పించాలని ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అంశం వుందని రిలీజ్‌కుముందు దర్శకుడు చెప్పిన విషయం ఫేక్ అని తెలిసింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేట్లుగా అప్పటికప్పుడు సన్నివేశాలు, డైలాగ్‌లు రాసుకుని చేసిన సినిమాగా అనిపిస్తుంది. అందుకు తగిన పాటలుకూడా అలానే వున్నాయి. సంగీతం కూడా భీమ్స్ బాగానే ఇచ్చాడు.
రవితేజ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించి సినిమా ఇది. శ్రీలీల కాజువల్ నటన డ్యాన్స్ ఫిదా అయిపోతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే అనిపిస్తుంది. ఇతర పాత్రల్లోని నటులు తెమ శైలిలో నటించారు. రావురమేష్‌కు డ్రైవర్‌గా హైపర్ ఆది జబర్‌దస్త్ డైలాగ్స్‌లా రాసుకున్నాడు. సరదాగా వుంటాయి. కొన్ని సీన్లలో కామెడీ పండిరది. రావు రమేశ్, హైపర్ ఆది కామెడీలో కొన్ని పంచ్ లు పేలతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, భీమ్స్ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో సీరియస్‌లోకి వెళ్తుంది.
రవి తేజ ద్విపాత్ర అభినయం కొన్నిచోట్ల గందరగోళం అనిపిస్తుంది. రొటీన్ గా కథ వెళ్తుంది. రెగ్యూలర్ ఫార్ములాతోనే సినిమాను నడిరపిచేశారు. కొన్ని సినిమా స్పూఫ్ లు కూడా ఇందులో చూడొచ్చు. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా లెవల్‌లో కథలు మారుతున్న తరుణంలో తన శైలిలోనే సినిమా వుండాలని దర్శకుడు, రచయిత, హీరోలు కమిట్ అయి తీసిన సినిమా ఇది. ఉన్నత విలువలతో నిర్మించిన ఈ సినిమా తీసిన నిర్మాతలను అభినందించాల్సిందే. ఎటువంటి కొత్తదనం లేని ఈ సినిమా రవితేజను ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది. లాజిక్‌లకు ఆస్కారంలేని ఈ థమాకా ఎంతవరకు పేలుతుందో ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి వుంటుంది.