సాంకేతికత: సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర, నిర్మాత: రాజేశ్ దండా, అనిల్ సుంకర, ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్, దర్శకుడు : వీఐ ఆనంద్. విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024
విఐ ఆనంద్ దర్శకత్వంలో గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా.. సినిమా వచ్చింది. ఈసారి ఇంచుమించు ఆ తరహా కథతో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన రూపొందించారు. సక్సెస్ లేని హీరో సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. వివిదాదస్ప నిర్మాతగా మారిన అనిల్ సుంకర దీనికి పార్టనర్. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. ప్రేక్షకులను ఏ మేరకు ఆదరిస్తుందో చూద్దాం.
కథ :
బసవ (సందీప్ కిషన్) స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ చోట బంగారం మూటను దొంగతనం చేస్తాడు. ఇది తెలిసి పోలీసులు వెంటపడుతుంటే జీపులో పారిపోతూ, రోడ్డు మార్గంలో ఓ అమ్మాయికి (గీత, కావ్య థాపర్) యాక్సిడెంట్ అయిందని భావించి ఆమెను కారులో తీసుకెళతారు. పోలీసుల ఛేజింగ్ నుంచి తప్పించుకునేందుకు ఓ అడవిమార్గంలోకి వెళతారు. ఆ ఊరు పేరు భైరవకోన. పురాతన భవనాలు, గుడిసెలు, వింత వింత వ్యక్తులు కనిపిస్తారు.
అలా ముగ్గురూ ఊరిలోకి వచ్చి అక్కడ డాక్టర్ వెన్నెల కిశోర్ ను గీతకు ట్రీట్ మెంట్ చేయమని చెప్పి సిగరెట్ తాగడానికి బయటకు వస్తారు. ఇక అక్కడనుంచి కథ వేరే వుంటది. ఇద్దరూ బయటనుంచి లోపలికి వచ్చేసరికి గీత కారులో పారిపోతుంది. బైరవకోనలోని జనాలు ఆమెపై దాడి చేస్తారు. తిరిగి డాక్టర్ దగ్గరకే గీత వస్తుంది. ఇక అప్పటినుంచి చిత్రమైన సంగతులు ముగ్గురూ చూస్తారు. అవి ఏమిటి? ఈ కథలో వర్ష బొల్లమ్మ పాత్ర ఏమిటి ? ట్రైలర్ లో తెగ ప్రచారం చేసిన గరుడ పురాణం లో మిస్ అయిన నాలుగు పేజీలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
మనుషులు ఆత్మలకు వున్న తేడా ఏమిటి? అనే పాయింట్ తో దర్శకుడు ఓ కల్పిత కథను రాసుకుని సినిమా తీశాడు. ఇంచుమించు ఎక్కడికి పోతావు చిన్నవాడా.. పాయింటే. నేపథ్యం వేరు. కోపం, పగ వున్నవాళ్ళు చనిపోయి భైరవకోన అనే ఊరిలో తిష్ట వేస్తారు. దెయ్యాలకూ ఎమోషన్స్ వున్నాయని కోణం కూడా చూపించాడు. ప్రధానమైన పాయింట్ బాగున్నా దాన్ని ఆసక్తిగా మలచడంలో దర్శకుడు సఫలం కాలేకపోయాడు. ఎక్కడా ఉత్సుకత కనిపించదు. ఏదో రొటీన్ గా సాగిపోతుంది.
ఇక వర్ష బొల్లమ్మకు చెందిన కథలో ఏమాత్రం కనెక్టివిటీ లేని అంశం. ఆమె కోసం దేనికైనా తెగించే పాత్ర హీరో సందీప్ కిషన్ ది. ఇందులో సందీప్ సూట్ కాలేదనే చెప్పాలి. డైలాగ్ మాడ్యులేషన్, హావభావాలు పెద్దగా ప్రేక్షులు ఓన్ చేసుకోలేకపోయారు. బైరవకోనలో పెద్ద ఆత్మగా రవిశంకర్ నటన బాగుంది. అందరికీ పెద్దమ్మగా చేసిన నటి ఓకే. ఆమె చేతిలో శివుడుని మంత్రదండం లాంటిది వుంటుంది. అది హీరోకు ఎలా దక్కింది? తను ఏవిధంగా ఆత్మలకోనకు విముక్తి కలిగించాడు అన్నది సెకండా్ ఆఫ్ లో చూపిస్తాడు.
టెక్నకల్ గా చూస్తే, కెమెరామెన్ పనితం బాగుంది. విజువల్ ఎపెక్ట్స్ సినిమాను నడిపాయి. నిజమే చెపుతున్నా...అని సిద్ శ్రీరామ్ నోటివెంట నుంచి వచ్చిన గానం ఒక్కటే అలరిస్తుంది. కావ్యథాపర్ ప్లేస్ లో ఎవరున్నాపర్వాేలేదన్నట్లుగా వుంటుంది. వెన్నెల కిశోర్ పాత్ర కామెడీగా బాగుంది. వైవా హర్ష పాత్ర ఓకే.
మైనస్ పాయింట్స్ :
కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, ఈ ఊరు పేరు భైరవకోన సినిమాలో అది పూర్తిగా మిస్ అయ్యింది. చాలా చోట్ల లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా మిస్ కావడం, మరియు బోరింగ్ ప్లే ఎక్కువ అవ్వడం వంటి అంశాల కారణంగా ఈ సినిమా బాగాలేదు.
విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. కథనం స్లోగా సాగడం, కొన్ని కీలక కీలక సన్నివేశాలు గ్రిప్పింగ్ లేకపోవడంతో నిరాశపరిచిందనే చెప్పాలి.
చివరగా.. బైరవకోనలో ఓ మంత్రదండం పట్టుకుని ఓ పెద్దమ్మ వుంటుంది. హీరోను చూసి ఇదంతా విధి కల్పన. విధి వల్లే మీరు భైరవకోనకు వచ్చారు. అంటుంది. అలా విధి ప్రేరేపిస్తేనే ఈ సినిమాను చూడగలరు.