చిరంజీవికి విశ్వక్‌సేన్ లైలాకు లింకేమిటి?: లైలా రివ్యూ

దేవి

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (14:39 IST)
viswak sen laila, sonu
నటీనటులు :విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ, కమెడియన్ పృథ్వి, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీ రాజ్ తదితరులు. సాంకేతికత : దర్శకుడు :రామ్ నారాయణ్, నిర్మాత :సాహు గారపాటి, సంగీతం: లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ :రిచర్డ్ ప్రసాద్
 
 కథ :
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సోను (విశ్వక్‌సేన్) లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. పార్లర్‌కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సోనుతో మేకప్ వేయించుకోవడానికి లేడీస్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు.  సోను జీవితంలోకి జెన్నీ(ఆకాంక్ష శర్మ) ఎంటర్ అవుతుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే సోను ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సోను పోలీస్ కేసులో ఇరుక్కుంటాడు. అందుకు  సోను అమ్మాయిగా గెటప్ వేసుకోవాల్సి వస్తోంది. ఇంతకీ సోనుకి వచ్చిన సమస్య ఏమిటి ? ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సినిమా. 
 
సమీక్ష:
విశ్వక్ సేన్ లేడీ గెటప్, ఆ గెటప్ కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, లవ్ సీన్స్,  పెళ్లి సీక్వెన్స్ అన్నీ హైదరాబాద్ నవాబ్ స్టైల్‌లో ఉంటాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వేష, బాషలు చూపించాడు. విశ్వక్ సేన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్‌తో బాగా నటించాడు. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అభిమన్యు సింగ్ పాత్రపై వచ్చే కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. చిరంజీవి సినిమా నటి లాగా తన కోడలు ఉండాలనే అందుకు చిరంజీవి ఫ్యాన్‌గా ఆయన తండ్రి చేసిన పనులు ఎంటర్టైన్ చేస్తాయి.
 
హీరోయిన్ ఆకాంక్ష శర్మ కేవలం గ్లామర్‌తో అలరించింది. హీరోతో సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి. విలన్‌గా బబ్లూ పృథ్వీ రాజ్ మేనరిజమ్స్ బాగున్నాయి. ప్రధాన పాత్రల మధ్య వచ్చే పంచ్‌లు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. కామెడి ఊర మాస్‌కి నచ్చుతుంది. అందుకే సన్నివేశాలు అలా రాసుకున్నాడు. 
 
లాజిజ్ లేకుండా సినిమా తీసాడు.  సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్‌కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు రామ్ నారాయణ్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్‌కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠత రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్‌తో సాగితే బాగుండేది. హీరోహీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్‌ను బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. అలాగే లేడీ గెటప్ ఎంట్రీ ఇచ్చాక వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి.. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల ఫన్‌తో సాగింది. ఆ ఫన్‌ను కూడా దర్శకుడు సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ లైలా చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నా.. పూర్తి స్థాయిలో సినిమా ఆకట్టుకోదు.
 
టెక్నికల్‌గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ సాగర్ దాడీ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాత సాహు గారపాటి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. రామ్ నారాయణ్ దర్శకత్వం బాగున్నా.. స్క్రిప్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
 
సరదాగా టైం పాస్ సినిమాగా ఉంది. కొన్ని చోట్ల మాటలు, చేష్టలు బూతులు కూడా ఉన్నాయి. విశ్వక్ సేన్ హైదరాద్ నవాబ్స్ తరహాలో తీసిన సినిమా. లేడీస్ పార్లర్లో సోను, లేడీస్ జిమ్‌లో కూడా సోను, హీరోయిన్‌ను ఎత్తుకుని రన్ చేయడం.. ఇలా చాల సన్నివేశాలు కేవలం ఓ వర్గం కోసం చేసిన ప్రయత్నం.
 
రేటింగ్ 2/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు