"నేను ఉపేంద్ర గారికి వీరాభిమానిని, UI ది మూవీ ట్రైలర్ నన్ను మెస్మరైజ్ చేసింది. సినిమా 20న విడుదలవుతోంది. ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది. ఉపేంద్ర గారు అద్భుతంగా చేశారు. ఇది భారీ హిట్ అవుతుంది. హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ట్రైలర్ చూడగానే షాక్ అయ్యాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను." అన్నారు అమీర్ ఖాన్.
అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, యూనిక్ కాన్సెప్ట్ పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. లీడ్ యాక్టర్ గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్ గా సినిమాని తీర్చిదిద్దారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన UI ది మూవీ రీజినల్, నేషనల్ ప్రేక్షకులపై బిగ్ ఇంపాక్ట్ ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రిలీజ్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి చెందిన గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఇస్తుంది.