ఒకే పాత్ర‌తో రూపొందిన నేటి భార‌తం చిత్రం ట్రైలర్ కు చంద్రబాబు అభినందన

డీవీ

శనివారం, 17 ఫిబ్రవరి 2024 (15:18 IST)
Bharat Parepalli, Dr. Yarra Sridhar Raju
ఒకే పాత్ర‌తో...సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం నేటి భార‌తం. భ‌ర‌త్ పారేప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ర్రా శ్రీధ‌ర్ రాజు న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేశారు.
 
Bharat Parepalli, Dr. Yarra Sridhar Raju and others
న‌టుడు, నిర్మాత డా. య‌ర్రా శ్రీధ‌ర్ రాజు మాట్లాడుతూ...`క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన ఆర్థిక‌, సామాజిక స్థితి గ‌తుల‌పై ఈ చిత్రం ఉంటుంది.   ముఖ్యంగా పాలసీ మేకింగ్ తో   పాటు ఆ పాల‌సీల వెన‌కాల రాజ‌కీయ నాయ‌కులు స్వార్థాలు, వాటి అమ‌లు తీరు ఇలా ప‌లు సోష‌ల్ ఇష్యూస్ పై  మా 'నేటి భార‌తం' చిత్రం చేశాము.  కీర్తి శేషులు పెద్దాడ‌మూర్తి ఈ చిత్రానికి అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. ఇందులో నేను జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టించాను. దీనికి తెర‌వెనుక హీరో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ పారేప‌ల్లి గారే. త‌న‌తో నేను విద్య‌, వైద్యం మీద మేరాభార‌త్ మ‌హాన్ అనే చిత్రం చేశాను. దానికి మంచి పేరొచ్చింది. అందులో నేను మంచి పాత్ర‌లో న‌టించా. ఆ ఇన్ స్పిరేష‌న్ తో ఒకే పాత్ర‌తో నేటి భార‌తం చిత్రం చేశాను. 
 
ఈ చిత్రంలో ఏపీ రాజ‌ధాని ఇష్యూతో పాటు,  విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సున్నిత‌మైన అంశాల గురించి కూడా చ‌ర్చించాము. మా ట్రైల‌ర్ చూసి ఎంతో ఇన్ స్పైర్ అయిన  చంద్ర‌బాబు నాయుడు  మా చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డమే కాకుండా మా టీమ్ ని ఎంతో  అభినందించారు.  దీనికి కార‌ణ‌మైన క‌ర్నూల్ కి చెందిన ఎమ్మెల్సీ  బీటీ నాయుడుకి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాం. ఏ వ్య‌క్తిని కించ‌ప‌ర‌చ‌కుండా కేవ‌లం పాల‌సీ మేకింగ్ గురించి మాత్ర‌మే మా చిత్రంలో చూపించాము. జ‌ర్న‌లిస్ట్ అంకిత‌భావం, తెగింపు మా చిత్రంలో చూపిస్తున్నాం. ఒక మంచి కాన్సెప్ట్ తో సింగిల్ క్యారక్ట‌ర్ తో వ‌స్తోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని  కోరుకుంటున్నా` అన్నారు.
దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ నేటి భారతం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. శ్రీధర్ రాజు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్  సాంబేష్ మాట్లాడుతూ...`నిర్మాత డా. శ్రీధ‌ర్ రాజు సినిమా ఇండ‌స్ట్రీకి మంచి చిత్రాలు చేయాల‌ని వ‌చ్చారు. అందులో భాగంగానే  తొలి సినిమాగా `మేరా భార‌త్ మ‌హాన్ అనే ఒక అద్భుత‌మైన చిత్రం చేసాము. దానికి మంచి పేరొచ్చింది. ప్ర‌స్తుతం ఒకే పాత్ర‌తో శ్రీధ‌ర్ గారు నేటి భార‌తం అనే గొప్ప చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ వ‌ల్ల  ప్ర‌జ‌లు ప‌డుతున్న‌ ఇబ్బందులను  ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...`శ్రీధ‌ర్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా చూశాను. స‌మాజంలో ఉన్న అసమాన‌త‌ల‌పై  ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట‌య్యేలా ఈ చిత్రం అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రం విజ‌యం సాధించాని ఆశిస్తున్నా` అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు