రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

డీవీ

గురువారం, 27 జూన్ 2024 (17:17 IST)
Chandrasekhar Rathore Kashvi Kanchan
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో ఈ చిత్రానికి కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ అందించడమే కాదు నిర్మిస్తూ దర్శకత్వం వహించారు చంద్రశేఖర్ రాథోడ్.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
Gangster movie teaser
ఈ కార్యక్రమంలో  రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి అని అన్నట్లు..చంద్రశేఖర్ రాథోడ్ తను హీరో కావాలి, ఫిలిం మేకర్ కావాలనే కలకన్నాడు. గ్యాంగ్ స్టర్ చిత్రంతో ఆ కలను నిజం చేసుకున్నాడు. మేము ఈ సినిమాను చూశాం చాలా బాగుంది. ఇటీవల కాలంలో నాకు బాగా నచ్చిన టీజర్ గ్యాంగ్ స్టర్ మూవీదే. ఈ టీజర్ కూడా తనే కట్ చేశాడు. ప్రతి విషయంలో చంద్రశేఖర్ ఇన్వాల్వ్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఖచ్చితంగా తన కష్టానికి ఫలితం ఉంటుంది. గ్యాంగ్ స్టర్ సినిమాను మీడియా, ప్రేక్షకులు అంతా ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.
 
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - సినిమాకు ఒక డిపార్ట్ మెంట్ వర్క్ చేయడమే కష్టం. అలాంటిది నాలుగైదు క్రాప్ట్స్ చేస్తూ దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ  హీరోగా నటించడం మామూలు విషయం కాదు. చంద్రశేఖర్ లాంటి వాళ్లు నిజంగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలి. వీళ్లు ఇండస్ట్రీకి అవసరం, ప్రేక్షకులకు కూడా అవసరం. గ్యాంగ్ స్టర్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ కాశ్వీ కాంచన్ మాట్లాడుతూ - గ్యాంగ్ స్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్. 24 గంటలు కష్టపడేంత ప్యాషన్ సినిమా మీద ఉన్న వ్యక్తి ఆయన. ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
రజాకార్ మూవీ డైరెక్టర్ యాట సత్యనారాయణ మాట్లాడుతూ - గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ చూసి ఎడిటర్ బాగా కట్ చేశాడు అని చెప్పాను. ఎడిటర్ కూడా చంద్రశేఖర్ చేశాడని తెలిసి ఆశ్చర్యపోయా. టీజర్ లోని సీక్వెన్స్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇది స్టార్స్ లేరు కాబట్టి చిన్న సినిమా అంటున్నారు గానీ ఇది కంటెంట్ పరంగా పెద్ద సినిమా. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, స్టంట్స్, కొరియోగ్రాఫర్ గా చంద్రశేఖర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఏ క్రాప్ట్ లో ముందుకు వెళ్లాలో తానే నిర్ణయించుకోవాలి. అన్నారు.
 
నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ - గ్యాంగ్ స్టర్ సినిమా టీజర్ చూసి నేను డిస్ట్రబ్ అయ్యాను. అంత బాగుంది టీజర్. కల్కి సినిమా మనం థియేటర్ లో చూస్తున్నాం. అందులోని ఓ ఆరు నిమిషాలు ఎలా ఉంటుందో అంత పవర్ ఫుల్ కంటెంట్ గ్యాంగ్ స్టర్ టీజర్ లో చంద్రశేఖర్ రాథోడ్ చూపించాడు. మంచి టీమ్ తో ఈ సినిమా చేసిన చంద్రశేఖర్ కు సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
 హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ - సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. కొన్ని షార్ట్ ఫిలింస్ చేసిన తర్వాత నాలుగేళ్ల కిందట ఈ మూవీ స్టోరీ డెవలప్ చేశాం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వర్క్ చేసుకుంటూ వచ్చాం. మనం ఏదైనా బలంగా అనుకుంటే జరిగి తీరుతుంది అనేందుకు గ్యాంగ్ స్టర్ సినిమా ఎగ్జాంపుల్. మాకు ఫిలిం మేకింగ్ లో ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. అయితే ఎలాగోలా, ఎవరో ఒకరి ద్వారా అవి సాల్వ్ అయ్యేవి. ఈ రోజు మా ఈవెంట్ కు ఇంతమంది పెద్దలు వచ్చి బ్లెస్ చేయడం కూడా నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. సినిమా టైటిల్స్ లో నాలుగైదు పేర్లు నావే ఉండాలని నేను అనుకోలేదు. డబ్బులు లేక ఫైట్స్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ నేనే చేసుకున్నా. గ్యాంగ్ స్టర్ సినిమా టీజర్ ను విజయేంద్రప్రసాద్ గారికి చూపించాను. ఆయన హగ్ చేసుకుని టీజర్ బాగుందంటూ ఆశీర్వదించారు. నా ముందే దిల్ రాజు గారికి ఫోన్ చేసి గ్యాంగ్ స్టర్ సినిమా టీజర్ చూశాను బాగుంది మీరూ చూడండి అని అడిగారు. ఏడాదిన్నరగా దిల్ రాజు గారిని కలిసేందుకు నేను ప్రయత్నించినా కానిది విజయేంద్రప్రసాద్ గారి ఒక్క ఫోన్ తో అయ్యింది. దిల్ రాజు గారు టీజర్ చూసి బాగుందన్నారు. వారి సంస్థలో మా సినిమా రిలీజ్ కావాల్సిఉంది. వారి టీమ్ చూసి డిసైడ్ చేయబోతున్నారు. రేపు రాజమౌళి గారు కూడా మా సినిమా టీజర్ చూస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే మీ ముందుకు మా గ్యాంగ్ స్టర్ సినిమాను తీసుకు రాబోతున్నాం. కల్కితో పాటు మా మూవీ టీజర్ కొన్ని థియేటర్స్ లో ప్లే చేస్తున్నాం. కల్కి మూవీ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి. అన్నారు.
 ఈ కార్యక్రమంలో నిర్మాత బోగేంద్ర గుప్తా, డైరెక్టర్ డాక్టర్ కాజా, డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు ఎం అతిథులుగా పాల్గొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు