బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పి శ్రీనివాస గౌడ్ నిర్మిస్తూ సహాయ నిర్మాతగా పి హేమంత్ వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో వస్తున్న మరొక అద్భుతమైన యాక్షన్ ఇంకా అడ్వెంచర్లు కలిగిన చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. టీజర్ ను చూస్తే డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా కనిపిస్తుంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్ అలాగే కొన్ని అడ్వెంచర్లు ఉన్నట్లు అర్థమవుతుంది. చిత్రం ఎంత నాణ్యంగా ఉండబోతుంది అనేది టీజర్ లోని నిర్మాణం విలువలు ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి.