వజ్రాన్నితయారుచేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అన్న పాయింట్‌తో `పీనట్ డైమండ్` రూపొందుతోంది. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై రూపొందిందుతోంది. అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలు. వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.