తన వ్యక్తిగత జీవితంపై సినీనటి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో తనకు నచ్చని అంశం కండిషన్స్ లేదా రూల్స్ (నియమ నిబంధనలు) అని చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సమంత వెకేషన్‌కు వెళ్లివున్నారు. అక్కడ జరుగుతున్న సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా లైఫ్ నా ఇష్టంగా ఉంటానని, నేనిలాగే ఉంటానని చెప్పారు. నా జీవితంలో నాకు నచ్చని అంశం రూల్ అని తెలిపారు.
సక్సెస్ అంట్ కేవలం గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయానికి ముఖ్యమని సమంత అన్నారు. తనకు నచ్చినట్టు జీవించడమే నిజమైన సక్సెస్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డులు, రివార్డులు మాత్రమే సక్సెస్ కాదని ఆమె స్పష్టం చేశారు.
"నా జీవితంలో నాకు నచ్చినట్టు బతకాలని అనుకుంటాను. నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలనుకున్నదే నా కోరిక. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదన్నారు. జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనేదే నా లక్ష్యం" అని అన్నారు. సిడ్నీ పర్యటన సందర్భంగా అక్కడి యువతతో ఆమె ముచ్చటించారు.