Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

సెల్వి

మంగళవారం, 25 మార్చి 2025 (12:08 IST)
సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన సమంత రూతు ప్రభు.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్థాయికి చేరుకుంది. సిటాడెల్: హనీ బన్నీ- ఫ్యామిలీ మ్యాన్ వంటి సినిమాలతో ఆమె కెరీర్‌ను బాగా డెవలప్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితం కూడా ప్రజలకు ఆకర్షణీయంగా ఉంది. 
 
ఆమె 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ ఇద్దరూ అభిమానులకు ప్రియమైన జంటగా మారారు. దురదృష్టవశాత్తు 2022లో వారి విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో తన తాజా ఫోటోలో వజ్రపు ఉంగరాన్ని ధరించడం ద్వారా పెద్ద పుకారు పుట్టించింది. ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. 
 
అయితే ఈ పుకారు ఇంకా ధృవీకరించబడలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన పుకార్లు వస్తూనే ఉంటాయి. సెలబ్రిటీ స్వయంగా నిర్ధారించే వరకు వేటిని నమ్మలేం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు