ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు

దేవీ

గురువారం, 12 జూన్ 2025 (16:38 IST)
Dil Raju, nitin and team
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు.
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - మా సంస్థలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ సినిమా ముద్దుల మామయ్యలా ఉంటుందా అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఇది అక్కా తమ్ముడి మధ్య జరిగే కథ అయితే కొత్త కాన్సెప్ట్ మూవీ. దీనికి రిఫరెన్స్ లేదు. ట్రైలర్ చూశారు. మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
గత ఆరు నెలల్లో నాలుగైదు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్ గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మా డైరెక్టర్, హీరో, ఇతర టీమ్ అంతా ఒక మంచి మూవీ చేసేందుకు కష్టపడ్డారు. థియేట్రికల్ గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా తమ్ముడు. మీరు తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు.
 
బడ్జెట్ గురించి చెప్పగానే, నేను ఇప్పటినుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను అన్నాడు, అలాగే నితిన్ కు ఫోన్ చేసి పరిస్థితి చెబితే రాజు గారు మీరు ఎంత పంపిస్తారో పంపించండి నా రెమ్యునరేషన్ గురించి పెద్దగా డిమాండ్ చేయను అన్నారు. ప్రొడ్యూసర్ పరిస్థితి తెలుసుకుని డైరెక్టర్, హీరో ఇలా సపోర్ట్ చేయడం గొప్ప విషయం. ఇది ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకురావాలి. సినిమా సక్సెస్ అయితే అందరి రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. కానీ ఫ్లాప్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు అన్నారు.
 
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ, ఈ సినిమాకు షెడ్యూల్, డేట్స్, వెదర్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే కొంత లేట్ అయ్యింది. తమ్ముడు పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ. అయితే ఇందులో కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు. ఐకాన్ కథ వేరు, ఇది వేరు. మా మదర్, సిస్టర్, డాటర్, వైఫ్..ఇలా నా లైఫ్ లో ప్రేమించే వుమెన్ ఉన్నారు. అందుకే నా ఎమోషన్స్ అన్నీ వాళ్లతోనే ఉంటాయి. నితిన్, నేను, రాజు గారు పవన్ గారి ఫ్యాన్స్. ఆయన అభిమానులుగా మా మూవీకి తమ్ముడు టైటిల్ పెట్టుకున్నాం.  అన్నారు.
 
హీరో నితిన్ మాట్లాడుతూ, నా కెరీర్ బిగినింగ్ లో దిల్ సినిమాకు రాజు గారు హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టారు. అప్పట్లో సెట్ సాంగ్ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. మళ్లీ తమ్ముడు మూవీకి నా కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు చేశారు. జూలై 4న మా మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు