పెద్దశేష వాహనంపై సర్వాంగసుందరంగా ఊరేగిన శ్రీనివాసుడు

శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:52 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం పూర్తయిన రోజు రాత్రి స్వామి వారు పెద్ద శేషవాహనంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవిల సమేతంగా సర్వాలంకార భూషిడైన తిరుమల మలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు కొండకు తరలివచ్చారు.

దేవేరులతో పెద్ద శేషుడిపై శీనివాసుడు ఊరేగింపులో కోలాటాలు, భజనలు భక్తులు అలరించాయి. ఈ వాహన సేవలో విశేషమేమిటంటే... స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగిస్తారని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి