హనమంత వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీరాముడిగా...(Video)

శనివారం, 8 అక్టోబరు 2016 (17:00 IST)
వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. త్రేతయుగం నాటి శ్రీరామచంద్రుడిని కూడా నేనేనని చెబుతూ వేంకటాద్రి రాముడిగా శ్రీనివాసుడు కనువిందు చేస్తాడు. ప్రతిరోజు రాముడి పేరిట సుప్రభాత సేవతో మేల్కొంటున్న వేంకటేశ్వరుడు లోకహితం కోసం రామునిగా, కృష్ణునిగా అవతరించినట్లు తెలియజేయడమే ఈ వాహన సేవలోని అంతరార్ధం. 
 
హనుమంతుడు దాస్యభక్తికి ప్రతీక, హనుమంతుని వలె దాసులై అనన్య భక్తితో తనను సేవించి అభీష్టసిద్ధి పొంది తరించండంటూ ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశమిస్తున్నారు. భగవంతుడి కంటే భగవన్నామ స్మరణే గొప్పదని చాటిచెప్పనవాడు హనుమంతుడు. శ్రీ మహావిష్ణువుకి వాహనం గరుత్మంతుడైతే, సేవకుడు హనుమంతుడు. త్రేతాయుగ రాముడిని మాత్రమే సేవించి తరించిన హనుమంతుడు సమస్త భక్తకోటికి ఆదర్శప్రాయుడు. కావున హనుమంత వాహనాన్ని దర్శించిన భక్తులందరు తన దాసులుగా మారాలన్నదే వాహనసేవలోని పరమార్థం.
 

వెబ్దునియా పై చదవండి