హనుమంతునిపై విహరించిన శ్రీవారు..

గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:22 IST)
హనుద్వావహనంపై తిరుమల శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు ఉదయం స్వామివారు వజ్ర, వైఢూర్యధారుడైహనుమంతునిపై ఊరేగారు. మాఢవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అశేషంగా దర్శించుకున్నారు. గోవిందనామసర్మణలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి హనుమంత వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీ స్థాయిలో తిరుమల గిరులపైకి చేరారు. ఈ సేవ గురువారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమై 11 గంటల వరకు జరిగింది. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది. ఇక గురువారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం, ఆ తర్వాత గజవాహన సేవలు జరగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు