శ్రీవారి బ్రహ్మోత్సావాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. "న భూతో న భవిష్యతి" అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు. స్వామి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని 'గరుడ ధ్వజ పటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు.
ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన వేడుక గురువారం సాయంత్రం నిర్వహిస్తారు.