తిరుమల బ్రహ్మోత్సవాలు: మోహినీ అవతారంలో శ్రీవారు

సోమవారం, 3 అక్టోబరు 2011 (20:52 IST)
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం శ్రీమలయప్ప స్వామి మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన సేవగా దీన్ని పేర్కొంటారు.

అన్ని వాహనసేవలూ వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభంకావడం దీని ప్రత్యేకత.

పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేసిన అవతారం కావడంతో దీనికి మోహనీ అవతారం అని పేరు వచ్చింది.

మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తాడు. అలాగే రాత్రికి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంలో విహరించనున్నారు.

వెబ్దునియా పై చదవండి