దేవునికి హారతి ఇచ్చేటపుడు గంట కొట్టడమెందుకు...?

దేవాలయాలలో వివిధ రకాలుగా గంటలు ఉంటాయి. అవి కలిగించే ఫలితాలు కూడా వాటిని అనుసరించి ఉంటాయి. ఇవి ఆరు రకాలుగా ఉంటాయి.

మొదటిది ధ్వజ స్తంభం దగ్గర( దీనినే బలి అని పిలుస్తారు) పక్షులకు ఆహారాన్ని పెట్టె సమయంలో ఒక తీరుగా మ్రోగించే గంట. రెండోది స్వామివారికి నైవేద్యం పెట్టేటపుడు మ్రోగిస్తారు. మూడో గంటను దేవుడికి మేలుకొలుపు పాటలను పాడేటపుడు మ్రోగిస్తారు.

అదేవిధంగా ఆలయాన్ని మూసివేసే సమయంలో మ్రోగించే గంట మరొకటి. ఇక మండపంలో మ్రోగించే గంట మరో విధంగా ఉంటుంది. స్వామివారికి హారతి ఇచ్చేటపుడు మ్రోగించే గంట చివరిది.

అయితే దేవునికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను దేవునికి హారతి ఇచ్చేటపుడు మ్రోగించకూడదు.

వెబ్దునియా పై చదవండి