భక్తజనకోటికి ఇలవేల్పుగా ఉన్న తిరుమల వెంకన్నకు అక్షరాలా 11 టన్నుల బంగారం ఆభరణాలతో అలంకరిస్తారంటే అతిశయోక్తి కాదు. శ్రీవారి నిత్య అలంకరణలో 120 రకాల ఆభరణాలను వినియోగిస్తారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వీటిని వినియోగిస్తారు.
శ్రీవారికి ప్రతి రోజూ చేసే అలంకారాన్ని నిత్యకట్ల అలంకారమనీ, పండుగలు, ఉత్సవాల్లో చేసే అలంకారాన్ని విశేషాలంకారమనీ పిలుస్తారు. మూలమూర్తి, ఉత్సవమూర్తి అలంకరణలకు వినియోగించే కిరీటాలు, ఆభరణాలు, ఇతర బంగారు వస్తు సామాగ్రిని కలుపుకుంటే సుమారు 11 టన్నులు బరువు కలిగివున్నట్టు సమాచారం.