తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం కలియుగదైవం శ్రీనివాసుడు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మోహినిని బంగారపు చీర, సూర్య - చంద్ర హారాలు, రత్న కిరీటాలు, కర్ణ పత్రాలు వీటితో పాటు వజ్రపు ముక్కుపుడకతో అలంకరిస్తారు. శ్రీక్రిష్ణుడి తోపాటు మోహినిని కూడ పల్లకీలో ఊరేగిస్తారు.
ఒక్క బ్రహ్మోత్సవంలో మాత్రమే మనం ఈ మోహినీ అవతారంలో చూడొచ్చు. ఈ అవతారంలో స్వామి వారు మనకి వరద హస్తం నుంచి అభయ హస్తం చూపిస్తారు. అన్ని అవతారంలో కల్ల అయిదవ రోజు రాత్రి వచ్చే "గరుడ సేవ" ఈ బ్రహ్మోతసవాల్లో ప్రాముఖ్య మైనది.
ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అరుదుగా వుండే లక్ష్మీ హారం, మకర-కంటి మరియు సహస్త్ర నామ హారం ధరించి గరుడ మీద తిరువీధుల్లో ఊరేగిస్తారు. మన పురాణాల ప్రకారం గరుడ అంటే పక్షి రాజు (వేదాలకు ప్రతిరూపం). అందుకే స్వామి ఆ రోజు ఆయనను గరుడలో చూసుకుంటాడు.
అందుకే గరుడ సేవకి అంత ప్రాముఖ్యత ఉంది. వైష్ణవ పురాణాల్లో గరుడని "పెరియతిరువాది" అని పిలుస్తారు. అంటే "ప్రధమ భక్తుడు" అని అర్థం. అన్ని వాహనాల్లో గరుడ వాహనం చాల గొప్పది. అందుకే ఈ మోహిని వాహనాన్ని అత్యంత వేడుకగా చేశారు. మోహిని వాహనం సందర్భంగా తిరుమల గిరులు గోవింద నామ స్మరణతో మార్మోగి పోయాయి.