ఇకపోతే... మంగళవారం రెండుగంటలకు తిరుమంజనం, అనంతరం ఏడు గంటలకు ఊంజల్ సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరుగనున్నాయని తితిదే వెల్లడించింది.
ఇదిలా ఉండగా... స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హుండీ ఆదాయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆరోరోజైన సోమవారం మాత్రం తిరుమలేశుని హుండీకి రూ. 1.5కోట్ల ఆదాయం లభించిందని తితిదే అధికారులు వెల్లడించారు.