పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆతర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. ఆతర్వాత వెంకీతో సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. వెంకి సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే తరుణ్ భాస్కర్ హీరోగా అవతారం ఎత్తాడు.
ఇదిలా ఉంటే.. సాయి రొనాక్, ప్రీతి అష్రాని జంటగా నటిస్తున్న చిత్రం ప్రెజర్ కుక్కర్. కరంపూరి క్రియేషన్స్ అండ్ మిక్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుజై, సుశీల్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ ప్రెజర్ కుక్కర్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఈ వీడియోలో ఈ చిత్ర టీజర్‌ను ఎందుకు కట్ చేయాలని అనిపించిందో తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇంకా అతనితో పాటు అతని పెంపుడు కుక్క కూడా ఈ టీజర్ ఎడిట్‌లో భాగమవుతుందని, టీజర్ నచ్చితే అందరూ షేర్ చేసి లైక్ చేయమని తరుణ్ ఈ వీడియోలో తెలిపారు. మరి.. తరుణ్ భాస్కర్ ఎడిటర్‌గా కట్ చేసిన టీజర్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.