మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని పాటి గ్రామంలోని కనియా ఘాట్‌లో మొసలి ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. శ్రావణ మాసం మొదటి రోజున స్నానం చేయడానికి 40 ఏళ్ల మాల్తీ బాయి నది ఒడ్డున కూర్చుని ఉండగా, ఒక మొసలి నీటి నుండి బైటకు వచ్చి ఆమెను లోపలికి లాగింది.
ఈ ఘటన అనంతరం అధికారులు అప్రమత్తం అయ్యారు. అటవీ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది. దాదాపు గంటసేపు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత, ఎదురుగా ఉన్న నది ఒడ్డున ఉన్న పొదల్లో చిక్కుకున్న మాల్తీ మృతదేహం కనిపించింది.