భార్య అంటే ఈమేరా...!! భర్త అంబరీష్‌కు ఫుల్ మందు బాటిల్ పెట్టి...

మంగళవారం, 29 జనవరి 2019 (16:11 IST)
చనిపోయిన వ్యక్తిని ఇరుకునపెట్టడం ఏమిటనుకుంటున్నారా.. ఒక్కోసారి అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. సాధారణ వ్యక్తులైతే ఇది పెద్దగా కనిపించదు. ప్రముఖులు కాబట్టి ఆ విషయం కాస్త చర్చకు దారితీస్తోంది. నటి సుమలత. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు సుమలత. చిరంజీవితో పాటు అప్పటి అగ్రహీరోల సరసన ఈమె నటించారు.
 
సుమలత భర్త అంబరీష్‌‌కు రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది. కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనది. అయితే ఈమధ్యకాలంలో అనారోగ్యంతో కన్నుమూశారు అంబరీష్‌. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది సుమలత. తన భర్తను ఆరాధించడంలో భాగంగా సుమలత తన ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టారు. అందులో తన భర్తకు ఇష్టమైన తినుబండారాలతో పాటు మద్యం బాటిల్, వాటర్ బాటిల్‌ను ఉంచారు. ఆ తినుబండారాలు, తన భర్త ఫోటో ముందు పెట్టి ఫోటోకు ఫోజిచ్చారు.
 
ఆ ఫోటో కాస్తా ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అర్థం చేసుకునే సుమలత లాంటి భార్య అందరికీ ఉండాలని నెటిజన్లు సామాజిక మాథ్యమాల ద్వారా పోస్టింగ్‌లు చేస్తున్నారు. భర్త చనిపోయిన తరువాత కూడా ఆయనకు ఇష్టమైన వాటిని ఉంచి పూజలు చేయడం సుమలతకు మాత్రమే తెలిసి ఉంటుందని, బహుశా ఇంకెవరికి తెలిసి ఉండే అవకాశం లేదంటున్నారు అంబరీష్‌ అభిమానులు. అయితే ప్రజా ప్రతినిధిగా ఉన్న అంబరీష్‌ పదిమందికి ఆదర్శంగా ఉండాలని, అలాంటిది మద్యం తాగడం ఏమిటని మరికొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు