గోబీ మంచూరియన్‌లో నో టేస్ట్.. వ్యాపారం డౌన్

సెల్వి

గురువారం, 21 మార్చి 2024 (15:40 IST)
గోబీ మంచూరియన్‌లో వాడే రసాయనాన్ని బెంగళూరులో నిషేధించారు. ఈ కెమికల్‌ వాడితే రూ.10వేలు జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ నోటీసులు కూడా ఇచ్చింది. అందుకే గత వారం రోజుల నుంచి గోబీ వ్యాపారులకు విపరీతమైన ఊరట కలిగించడంతో పాటు గోబీ మంచూరియా తినే వారి సంఖ్య తగ్గింది. 
 
గోబీ మంచూరియాలో వాడే రసాయనం వల్లే కేన్సర్ వ్యాపిస్తోందని స్పష్టమవుతోంది. గోబీ మంచూరియాలో వాడే రసాయనాన్ని ఆహార శాఖ నిషేధించింది. దీంతో గోబీ మంచూరియన్ వ్యాపారుల వ్యాపార టర్నోవర్ ఒక వారం నుండి 80 శాతం పడిపోయింది. వినియోగదారులు కూడా గోబీ తినేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎక్కువ మంది పానీపూరీ, భేల్ పూరీ, సెవ్ పూరీ మరియు ఇతర చాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు