శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

సెల్వి

మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (07:33 IST)
Aghori Sri Varshini Marriage
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ శ్రీనివాస్ పెళ్లి చేసుకుంది. ఏపీకి చెందిన యువతిని గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు వేసుకుంది. 
 
అంతకుముందు శ్రీవర్షిణి, అఘోరీ ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడం.. ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగారు. ఈ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. యువతితో నాగసాధు పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ పేదరికంలో పుట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సన్యాసం స్వీకరించాడు. అనంతరం అమ్మాయిగా మారాడు. నాగసాధు అవతారం ఎత్తి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళగిరి ప్రాంతానికి చెందిన యువతి శ్రీవర్షిణితో పరిచయమైంది. ఆమెను వశం చేసుకుని ఇంటి నుంచి బయటికి రాగానే పలుచోట్ల తిరిగింది.
 
అయితే తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి నాగసాధు ఎత్తుకెళ్లిపోయిందని కుటుంబసభ్యులు తెలంగాణతోపాటు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కుటుంబసభ్యులే గుజరాత్‌కు వెళ్లి శ్రీవర్షిణిని నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. 
 
అయితే మంగళగిరికి వచ్చాక కొన్ని రోజులు బాగానే ఉన్న శ్రీవర్షిణి అనంతరం చెప్పాపెట్టకుండా మళ్లీ పారిపోయింది. రెండు రోజుల కిందట పారిపోయిన శ్రీవర్షిణి ఎట్టకేలకు అఘోరీ నాగసాధుతో వివాహం చేసుకుంది. 

పెళ్లి చేసుకున్న అఘోరీ, శ్రీవర్షిణి pic.twitter.com/sXmxJxwanV

— ChotaNews App (@ChotaNewsApp) April 15, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు