కరోనా ఔషధాన్ని రహస్యంగా తయారుచేస్తున్న ఆనందయ్య, ఎవరికోసం?

బుధవారం, 26 మే 2021 (15:50 IST)
కరోనాతో వచ్చిన వారు ఆనందయ్య తయారుచేసిన మందును వేసుకుంటే చాలు క్షణంలో లేచి కూర్చుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం కూడా ఈ మందును పంపిణీ చేయాలని చెప్పింది. ఒకరోజులోనే గందరగోళం నెలకొని లాఠీఛార్జ్ చేసి చివరకు తాత్కాలికంగా మందు పంపిణీని నిలిపివేశారు. ఇది తెలిసిందే.
 
ఇప్పడు ఆనందయ్య తయారుచేసిన ఔషధంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తిరుపతి ఆయుర్వేద కళాశాల, విజయవాడ ఆయుర్వేద కళాశాలలో దీనికి సంబంధించిన పరిశోధనలు రెండురోజుల నుంచి ప్రారంభమయ్యాయి. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆనందయ్య మందు బాగుందని నివేదిక ఇస్తేనే రాష్ట్రప్రభుత్వం ఆ మందును పంపిణీ చేయడానికి అనుమతినిస్తుంది. లేదంటే లేదు.
 
అయితే ఈ పరిశోధనలు జరిగేందుకు ఆలస్యమవుతోంది. దీంతో ఆనందయ్య దగ్గరకు చాలామంది కరోనా రోగులు వస్తున్నారట. ఆయనకు బాగా సన్నిహితులుగా ఉన్న వారు కూడా కరోనా సోకడంతో ఆనందయ్యను వారు సంప్రదించారట. పోలీసుల బందోబస్తు నడుమ ఆనందయ్య ఉన్నారు.
 
అయితే సన్నిహితులను బతికించుకోవడానికి ఆనందయ్య రహస్యంగా తాను ఉన్న చోటనే ఈ ఔషధాన్ని తయారుచేస్తున్నాడట. వెయ్యిమంది రోగులకు ఇచ్చే విధంగా మందును తయారుచేశాడట ఆనందయ్య. ఇక వాటిని ఎవరికీ తెలియకుండా పంపిణీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు