ఆర్మీ జవాను భార్యపై 120 మంది దాడి.. అర్ధనగ్నంగా ఊరేగింపు

మంగళవారం, 13 జూన్ 2023 (15:31 IST)
Army
ఆర్మీ జవాను భార్యపై దాడి జరిగింది. అర్ధనగ్నంగా ఆమెను ఊరేగించారు. 120మంది ఆమెపై దాడి చేశారు. తాను కాశ్మీర్ విధుల్లో వుండగా.. తన కుటుంబం ఇలా కష్టాలు పడుతుందని ఆ ఆర్మీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఆర్మీలో పనిచేసే ఒక హవల్దార్ వీడియో రూపంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కందవాసల్ ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ ఆర్మీలో హవాల్దార్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఇతని భార్య కందవాసల్ ప్రాంతంలో ఓ భూమిని తీసుకుని వ్యాపారం చేస్తోంది. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. 
 
ఈ వివాదానికి సంబంధించి తన భార్యపై 120 మంది దాడి చేశారని, అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారని చెప్పాడు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. దర్యాప్తు జరుపుతున్నామని నాగపట్నం పోలీసులు హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి