తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రోడ్ సైడ్ టీ స్టాల్ నుండి ఒక కప్పు చాయ్‌ను ఆర్డర్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుటేజీలో, గేట్స్ చాయ్‌వాలాను వన్ ఛాయ్ ప్లీజ్ అని అడగడం.. రోడ్ సైడ్ బాయ్ టీ తయారు చేసి.. ఆయనకు ఇవ్వడం చూడవచ్చు.