ఢిల్లీలో దీక్ష : ఆంధ్రా భవన్ వేదికగా ధర్మపోరాటం

సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరాటం మొదలుపెట్టారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఆయన ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్షను చేపట్టారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా భవన్ వేదికగా ప్రారంభమైన ఈ దీక్షలో చంద్రబాబు పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతు సంఘాలు, టీడీపీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష సాగనుంది. ఈ దీక్షకు సంఘీభావం తెలుపాల్సిందిగా చంద్రబాబు జాతీయ పార్టీల నేతలకు ప్రత్యేకంగా లేఖలు కూడా రాశారు. ఈ
 
ఈ దీక్షలో కూర్చొనేముందు చంద్రబాబు రాజ్‌ఘాట్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని పాలించే అర్హత ప్రధాని మోడీకి లేదన్నారు. పైగా, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. న్యాయం చేయమంటే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు విభజన గాయం మానలేదన్నారు. మూడురోజుల సమయం ఉంది... ఇప్పటివరకు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి... పార్లమెంట్‌లో ప్రకటన చేయండని సూచించారు. లేదంటే ఏపీ ప్రజలు శాశ్వతంగా బీజేపీని బహిష్కరించే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అన్నారు. 
 
పైగా, తెలుగు ప్రజల సత్తా ఏంటో చెప్పడానికే ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు. అలాగే, గుంటూరు వేదికగా ప్రధాని మోడీ అడిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు... కేంద్రం ఇచ్చిన నిధులకు కూడా లెక్కలు చెప్పేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మేం కట్టే పన్నుల లెక్కలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ మోడీని చంద్రబాబు నిలదీశారు. మోడీ వ్యక్తిగత విమర్శల దిగారని ఆరోపించారు. మేం పోరాడేది పోరాడేది హక్కుల కోసమే కానీ... మీ భిక్ష కోసం కాదని చంద్రబాబు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు