ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలోను ప్రారంభించిన చిరంజీవి.. అప్పటి నుంచి అదిరిపోయే పంచ్‌లతో ట్వీట్లు చేస్తున్నారు. పైగా, కోవిడ్ విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించేలా ట్వీట్లు చేశారు.
ఈ క్రమంలో తాజాగా ఒడిషాకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారిణి... సాటి మహిళ పట్ల మాతృమూర్తి ప్రేమను చూపింది. మతిస్థిమితం లేని మహిళకు స్వయంగా అన్నం తినిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరస్ అయింది. అది చిరంజీవి దృష్టికి వచ్చింది. అంతే.. ఆ మహిళా పోలీస్ అధికారిణి మొబైల్ నంబరు తీసుకుని వీడియో కాల్ చేసిన చిరంజీవి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పరిపూర్ణమైన మాతృమూర్తిగా మారిపోయి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతంగా నిలిచారని కీర్తించారు. కాగా, ఆ మహిళా అధికారిణి పేరు శుభశ్రీ. ఈమెకు చిరంజీవికి మధ్య జరిగిన సంభాషణలు క్లుప్తంగా పరిశీలిస్తే,
చిరంజీవి: గుడ్ మార్నింగ్ శుభశ్రీ జీ
శుభశ్రీ: సర్ నమస్తే సర్
చిరు: నమస్తే నమస్తే.. ఆ శుభశ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది.. అందులో మీరు ఓ మతి స్థిమితం లేని మహిళకి భోజనం తినిపిస్తున్నారు. అది నా మనసుని తాకింది. నన్ను చలింపజేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు చాలా సంతోషించాను. ఎంతో బాధ్యతగా మీరు ఈ పని చేయడానికి కారణమేంటీ?
చిరంజీవి: మీరు చాలా మందికి స్ఫూర్తివంతంగా నిలిచారు.
శుభశ్రీ: బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్ కాపాడడం మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. మీరు నాతో మాట్లాడుతుండడంతో నేను ఎంతో ఉత్తేజం పొందుతున్నాను. మీరు మెగాస్టార్ మాత్రమే కాదు.. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.