ఎన్నో దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన అయోధ్య భూవివాద కేసుకు త్వరలో పరిష్కారం లభించనుంది. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూవివాదం కేసులో రోజు విచారణ ముగిసింది. త్వరలో తుదితీర్పును వెలువరించనుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తన విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మొత్తం నలబై రోజులుపాటు వాద ప్రతివాదనలు విన్నది. మరో పక్క గొగోయ్ పదవీకాలం వచ్చే నెల 17న పూర్తికానుండటంతో ఈ లోపే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.