ఇలాంటి పరిస్థితుల్లో హాచెట్ హెచ్చరిక ప్రజల్లో భయాందోళనకు కారణమైంది. కరోనాలో ఎప్పటికప్పుడూ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. జన్యు పరిణామ క్రమంలో ఒక్కోసారి వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొవిడే కాకుండా మరెన్నో కొత్త వ్యాధులు పొంచి ఉన్నాయని.. వాటి విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో గన్యా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఉగాండాను ఎబోలా వైరస్ కుదిపేస్తోంది. ఏ వ్యాధి లేదా వైరస్ ఎక్కడి నుంచి, ఎప్పుడు ఉద్భవిస్తుందో అంచనా వేయలేమని రిచర్డ్ హాచెట్ తెలిపారు. కొత్త కొత్త ఉపద్రవాలకు మనం సిద్ధపడాల్సిందేనని తెలిపారు.