వివరాల్లోకి వెళితే.. కంబోడియా ప్రే వెంగ్ ప్రోవిన్సయాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్, ఛాతి ఎక్స్-రేలో బతికున్న బొద్దింక వచ్చిందని భారత దేశానికి చికిత్స కోసం వెళ్ళగా, భారత డాక్టర్లు అతనితో బొద్దింక నీ ఊపిరితిత్తుల్లో కాదు, నీకు ఎక్స్-రే తీసిన మెషీన్లో ఉందని పేర్కొన్నట్టు ఈ పోస్టులలో తెలిపారు. ఈ ఫోటోని కంబోడియా దేశానికి చెందిన పలు మీడియా సంస్థలు కూడా షేర్ చేసాయి.
ఈ ఫోటోని మొట్టమొదట షేర్ చేసిన కంబోడియా మీడియా సంస్థ.. ఈ ఫోటోని కేవలం సరదా కోసం సృష్టించిందని, ఒక ఆర్టికల్‌లోని ఫోటోని, ఒక ఫేస్‌బుక్ పేజిలోని ఫోటోని జత చేస్తూ ఈ ఫోటోని రూపొందించామని ఒప్పుకున్నట్టు తెలిసింది.