గణేష నిమజ్జనం అంటే ఇలా జరగాలి.. వీడియో వైరల్

సెల్వి

సోమవారం, 16 సెప్టెంబరు 2024 (15:11 IST)
Ganesha immersion
గణపయ్య విగ్రహాలను నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. వినాయక విగ్రహాన్ని ఎంతో భక్తిభావనలో ప్రతిష్టాపని చేసి పూజలు జరిపించారో..అంతే జాగ్రత్తగా.. నిమజ్జనం వేడుకను కూడా నిర్వహిస్తారు. 
 
కొంత మంది వినాయకుల విగ్రహాలను ఊరేగింపు తీసుకెళ్లేటప్పుడు.. డీజేలు, బ్యాండ్ లను ఏర్పాటు చేస్తారు. మాస్ పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేసుకుంటూ ఊరేగింపు నిర్వహిస్తారు. మరికొందరు భక్తి పాటలు పెట్టుకుని భజనలు చేస్తు కూడా నిమజ్జనం కార్యక్రమం చేస్తారు.
 
వికారాబాద్ జిల్లాలోని పూడురులో వినాయక నిమజ్జనం వేళ గణపయ్యకు అపచారం జరిగిందని చెప్పుకొవచ్చు. ఒక పోలీసు తప్పతాగి వినాయకుడి విగ్రహాన్ని తాకడమే కాకుండా.. ఆ విగ్రహాం ధ్వంసం కావడానికి కూడా కారణమయ్యాడు.
 
దీంతో ఇది కాస్త ప్రస్తుతం వివాదానికి కారణంగా మారింది. సరే ఇలాంటి వివాదాల నడుమ గణపయ్య విగ్రహాల నిమజ్జనం ఇలా జరగాలని చెప్పే సూపర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బాలీవుడ్ డర్టీ సాంగ్స్ లేకుండా.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గణపయ్యను నెత్తిన మోసుకెళ్లి చెరువులో కలిపిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా గణేష నిమజ్జనం ఇలా జరగాలంటూ కామెంట్లు పెడుతున్నారు. 

This is correct way of Ganesh visarjan

No drunk people dancing on DJ on Bollywood dirty songs pic.twitter.com/zOa5OFnTbx

— Eminent Woke (@WokePandemic) September 15, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు