కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాబోయే కర్ణాటక సీఎంకు భార్య కావడంతో పాటు శాండల్‌వుడ్‌లో ప్రముఖ నటి, నిర్మాత రాధిక కుమారస్వామి పేరు మారు మోగిపోతోంది. మే 13 నుంచి మే 19 మధ్య కాలంలో.. ''రాధిక కుమారస్వామి'' అనే పదం గూగుల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
గూగుల్ ట్రెండ్స్ భారత్‌లో సెర్చింజన్‌లకు సంబంధించిన వంద పాయింట్స్ ఇస్తే.. అది అత్యున్నతమైన సెర్చ్ పదమని అర్థం. ఈ నేపథ్యంలో రాధిక కుమార స్వామి పేరు.. ఖతార్‌లో అనూహ్యంగా 38 పాయింట్లు సాధించింది. ఇదే తరహాలో యూఏఈలో 22, శ్రీలంకలో 19, కువైత్‌లో 18 పాయింట్లు రావడం గమనార్హం.
రాధిక కుమార స్వామి గురించి..
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమార స్వామికి ఆమె రెండో భార్య. గతంలో దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా నటించారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాధిక కుమార స్వామి పేరు గూగుల్ టాప్ సెర్చ్ ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయాల్లో ఈమె లేకున్నా, రాధికకు ఉన్న సినిమా నేపథ్యం ఆమెను పాపులర్ చేసింది. ఆమెకు సంబంధించిన వివరాల గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
తన 16వ ఏటనే తొలిసారిగా వెండితెరపై కనిపించిన ఆమె, మొదట శాండల్ వుడ్‌ను తన అందంతో ఊపేశారు. టాలీవుడ్‌లో నందమూరి తారకరత్న హీరోగా చేసిన 'భద్రాద్రి రాముడు' చిత్రంలో రాధికే హీరోయిన్. ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించకపోయినా, 'అరుంధతి' సూపర్ హిట్ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్స్ చిత్రం 'అవతారం'లో రాధిక హీరోయిన్‌గా నటించారు.