అమెరికాలో హైదరబాదుకు చెందిన యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆమె పేరు రూత్ జార్జ్. ప్రస్తుతం ఈమెను హత్య చేసిన నిందితుడు డొనాల్డ్ తుర్మాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి రూత్ జార్జ్ (19) తనతో మాట్లాడేందుకు నిరాకరించడం లేదా తాను పిలిస్తే స్పందించలేదనే కోపంతో నిందితుడు గొంతు నులిమి చంపేసి వుంటాడని ప్రాసిక్యూటర్ వివరించారు.
మంగళవారం తుర్మాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ జేమ్స్ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి జార్జ్ పార్కుకు నడుచుకుంటూ వెళ్తుండగా తుర్మన్ పిలవగా పలకలేదు. దీంతో ఆవేశానికి గురైన తుర్మన్ జార్జ్‌ను వెంబడించాడని చెప్పారు.
ఆమె చాలా అందంగా ఉందని, తనతో మాట్లాడాలని భావించాడని, అయితే ఆమె స్పందించలేదని వివరించారు. దీంతో కోపోద్రిక్తుడై గొంతు నులిమాడని, దీంతో అచేతనా స్థితిలోకి వెళ్లిందని చెప్పారు. ఆమెను తన కారు వెనుక సీటులోకి ఎక్కించి అత్యాచారం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.