ఆదివారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడస్తూ.. కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో భారత ఆర్మీ.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. ఆర్టిలరీ గన్స్‌ను ఉపయోగించి.. ఉగ్ర క్యాంపులే లక్ష్యంగా కాల్పులకు దిగింది. ఈ దాడిలో పలు ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.