జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య : గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ దోషి

బుధవారం, 2 మే 2018 (15:59 IST)
దేశంలో సంచలనం కలిగించిన జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య కేసులో గ్యాంగ్‌స్ట్ చోటా రాజన్ దోషిగా తేలారు. ఏడేళ్ల కిందట జరిగిన ఈ హత్య కేసులో కోర్టు బుధవారం తుదితీర్పును వెలువరించింది. అలాగే, మాజీ జర్నలిస్టు జిగ్నాను కోర్టు నిర్దోషిగా తేల్చింది.
 
గత 2011 జూన్ నెలలో జర్నలిస్టు జోతిర్మయ్ డేను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపగా, దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో చోటా రాజన్ ఆదేశాల మేరకే ఆయనను కాల్చి చంపినట్లు వెల్లడించారు. 
 
ముఖ్యంగా, "చింది - రాగ్స్ టు రిచెస్" పేరుతో తాను రాయబోయే పుస్తకంలో చోటా రాజన్ గురించి కూడా ప్రస్తావించడం గ్యాంగ్‌ స్టర్‌‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ పుస్తకంలో 20 మంది గ్యాంగ్‌‌స్టర్ల జీవిత చరిత్రలను ఈ పుస్తకంలో జ్యోతిర్మయ్ డే వివరించారు. దీన్ని జీర్ణించుకోలేని చోటా రాజన్... కొంతమందిని పురమాయించి జోతిర్మయిని హత్య చేయించినట్టు తేలింది.
 
ఇందుకోసం రూ.5 లక్షల సుపారీ కూడా ఇచ్చినట్టు పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో అప్పటి 'ది ఏషియన్ ఏజ్' పత్రిక డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా ఉన్న జిగ్నా వోరాను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. చోటారాజన్‌‌తో చేతులు కలిపి జ్యోతిర్మయ్ డేను చంపడానికి జిగ్నా ప్లాన్ చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే ఈ హత్యతో అతనికి సంబంధం లేదని కోర్టు తేల్చింది. చోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. జ్యోతిర్మయ్ డే మిడ్‌ డే ఈవెనింగర్‌‌లో క్రైమ్ రిపోర్టర్‌‌గా పనిచేసేవారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు