ఆ నన్... 12 సార్లు ఎంజాయ్ చేసి.. 13వ దఫా రేప్ అంటే ఎలా?
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (18:14 IST)
కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసి (నన్) అత్యాచార కేసు కీలక మలుపు తిరిగింది. జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి రెండేళ్ళలో 13 సార్లు ఆ సన్యాసిపై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే, ఈ అత్యాచార కేసుపై కేరళ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఆ సన్యాసి ఓ వ్యభిచారి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పైగా, 12సార్లు ఎంజాయ్ చేసి.. 13వ సారి అత్యాచారం అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ క్రైస్తవ సన్యాసిని(నన్)పై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర ఎమ్మెల్యే మాట్లాడుతూ, బిషప్‌పై లైంగికదాడి ఆరోపణలు చేసిన నన్ కాదనీ, ఒక వేశ్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నెరుపుతున్న నన్‌ను ఏమని పిలువాలి? 13 సార్లు నన్ను రేప్ చేశాడని ఆమె చెప్తున్నది. మిగిలిన 12సార్లు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు. అంటే 12 సార్లు ఎంజాయ్ చేసి.. 13వ సారి రేప్ అంటే ఎలా అంటూ నిలదీశారు.
నన్ అంటే ఆమె కన్యగా ఉండాలి. తన కన్యత్వాన్ని కోల్పోతే ఇక ఆమెను సన్యాసినిగా పరిగణించలేం అని అసహ్యంగా మాట్లాడారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులను బద్నాం చేయడానికి మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
'ఆవిడ నిజంగానే లైంగిక హింసకు గురయ్యాననుకుంటే ముందే ఈ విషయాన్ని ఇంతకుముందే ఎందుకు బహిరంగ పర్చలేదు? బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై మొదట్లోనే ఎందుకు కేసు వేయలేదు?' అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు తీవ్ర కలత చెందిన నన్.. బోరున విలపిస్తోంది.
మరోవైపు, జలంధర్ డియోసెస్ అనే నన్‌కు మద్దతుగా ఐదుగురు నన్‌లు కేరళ హైకోర్టు ముందు నిరసన చేపట్టారు. ఈ విషయంపై నన్‌కు మద్దతుగా కేరళలోని పలు ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా బిషప్‌పై కేరళ పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు.