అయితే, చంద్రయాన్ చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత తొలి అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడిని తన కెమెరాలో బంధించిన చిత్రాన్ని భూమిపైకి పంపింది. ఎల్-14 కెమెరాతో రాత్రి సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ చిత్రీకరించిన ఫోటోను ఇస్రో విడుదల చేసింది.
ఇక ఈ ఫోటోను ట్వీట్ చేసిన ఇస్రో, చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్ ఓరియంటేల్ అనే మరొక పెద్ద బిలాన్ని చిత్రంలో చూడవచ్చని పేర్కొంది.
ఇదిలావుంటే తాజాగా సమాచారాన్ని ఇస్రో అప్డేట్ చేసింది. చంద్రయాన్ 2 వ్యోమనౌకలో ఉన్న టెర్రేయిన్ మ్యాపింగ్ కెమెరా-2(టీఎంసీ-2) తీసిన ఫోటోలను వెల్లడించింది. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 2లో ఉన్న కెమెరాకు ఈ ఫోటోలు చిక్కాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న అగాధాలను ఆ కెమెరా చిత్రీకరించింది. జాక్సన్, మాచ్, కొరలేవ్, మిత్రా లాంటి క్రేటర్స్ కనిపించినట్లు ఇస్రో చెప్పింది.
మిత్రా అగాధానికి ప్రొఫెసర్ సిసిర్ కుమార్ మిత్ర పేరు పెట్టారు. ప్రొఫెసర్ మిత్రా భూగోళ శాస్త్రవేత్త. ఆయనకు పద్మ భూషన్ అవార్డు కూడా ఇచ్చారు. ఐయనోస్పియర్, రేడియోఫిజిక్స్‌లో ప్రొఫెసర్ మిత్రా అద్భుతమైన అధ్యయనాలు చేశారు.