చాయ్ వాలా అవతారమెత్తిన ముఖ్యమంత్రి.. కార్యకర్తలకు టీ పెట్టిచ్చారు...

గురువారం, 22 ఆగస్టు 2019 (15:56 IST)
దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా కనిపించే వారిలో మమతా బెనర్జీ ఒకరు. ఈమె వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, ఆమెలో సీఎం స్థాయి దర్బం వీసమెత్తుకూడా కనిపించదు.
 
తన కార్యాలయంలో చెక్క బెంచీపైనే కూర్చొని విధులు నిర్వహిస్తారు. అలాగే, తన కాన్వాయ్‌లో లగ్జరీ కార్ల స్థానంలో మామూలు కార్లనే వాడుతుంటారు. ఇలా ఆమె ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. కానీ, ఆమెతో పెట్టుకుంటే మాత్రం ఎవరైనా మటాషైపోవాల్సిందే.
 
అలాంటి మమతా బెనర్జీ బుధవారం ఆమె తన పార్టీ నేతలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో దిఘాలోని దత్తాపూర్‌లోని ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆగారు. కారు దిగిన ఆమె నేరుగా ఆ దుకాణంలోకి వెళ్లారు. దుకాణం యజమానితో కాసేపు ముచ్చటించి ఆమె స్వయంగా తన పార్టీ కార్యకర్తలకు టీ పెట్టి ఇచ్చారు. సీఎం చేసిన ఆ పనికి ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది. 
 
దుకాణం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో సెక్యూరిటీ అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పి అక్కడున్న వారితో కాసేపు మాట్లాడిన అనంతరం సీఎం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వీడియోను మమత తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 'చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఆనంద పరుస్తాయి' అని క్యాప్షన్‌ ఇచ్చి వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మమతా నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 

#WATCH West Bengal Chief Minister Mamata Banerjee prepares tea & serves it to locals in Duttapur, Digha. (Video Source - Mamata Banerjee's twitter handle) pic.twitter.com/UGZAjKG02H

— ANI (@ANI) August 21, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు