ఆ మీడియా ప్రతినిధి రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు: వేణు స్వామి ఆరోపణ (Video)

ఐవీఆర్

సోమవారం, 19 ఆగస్టు 2024 (22:02 IST)
వివాదాస్పద జ్యోతిష్కుడుగా పేరుకెక్కిన వేణు స్వామి ప్రముఖ మీడియా ప్రతినిధి పైన సంచలన ఆరోపణలు చేసారు. తనను రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఓ ఆడియోతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పోస్టులో ఓ మహిళ అవతలి వ్యక్తితో వేణు స్వామి అంత ఇచ్చుకోలేరంటూ చెబుతున్నారు. అవతలి వ్యక్తి పేరు జూనియర్ జర్నలిస్ట్ అమర్ అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా డబ్బు డిమాండుపై సాగింది. ఓ జ్యోతిష్యుడిని రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం ఏంటనీ, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ నిద్రలేని రాత్రులకు గురి చేస్తున్నారంటూ వేణు స్వామి దంపతులు ఆవేదన వ్యక్తం చేసారు.
 
ఈ వేధింపులు తాళలేక తాము గత కొన్నిరోజులుగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామనీ, తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా ఆ వీడియోలో వారు తెలిపారు. ఈ వీడియోను చూసిన తర్వాత తమను లాయర్లు కాపాడుతారో, పోలీసులు కాపాడుతారో, జర్నలిస్టులు కాపాడుతారో తెలియదనీ, తమకు న్యాయం జరిగితే ఇంకా తమ వద్ద వున్న సాక్ష్యాలను బయటపెడతామంటూ చెప్పారు వేణుస్వామి సతీమణి. ఈ వీడియోలో చూడండి. 

టీవీ5 మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

మేం ఆత్మ హత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాం అంటూ ఇంస్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన వేణు స్వామి దంపతులు pic.twitter.com/5K2OXz67aO

— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు