డ్రిల్ బోధకుడికి హ్యాట్స్ ఆఫ్... ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి

బుధవారం, 17 జూన్ 2020 (15:57 IST)
తెలంగాణలోని అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అయిన మహ్మద్ రఫీ, డ్రిల్ ప్రాక్టీసులో భాగంగా ఆలపించిన ట్యూన్, దానికి అనుగుణంగా సాగుతున్న డ్రిల్ చూస్తే ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నియామకాలకు శారీరక శిక్షణ ఇస్తున్నప్పుడు, 1970 చిత్రం హమ్ జోలి నుండి 'ధల్ గయా దిన్' అనే పాటను ఏఎస్ఐ అద్భుతంగా పాడటమే కాదు, దానికి అనుగుణంగా డ్రిల్లో పాల్గొన్నవారికి నూతనోత్సాహం కలిగించారు.
 
ఈ పాటను బాలీవుడ్ గొప్ప ప్లేబ్యాక్ గాయకులలో ఒకరిగా పరిగణించబడే మహ్మద్ రఫీ పాడారు. అదే పాటను 'ధల్ గయా దిన్' పాడుతూ ఏఎస్ఐ రఫీ డ్రిల్ చేయించడంపై తెలంగాణ సీనియర్ ఐపిఎస్ అధికారి అనిల్ కుమార్ ట్విట్టర్‌ సదరు డ్రిల్ బోధకుడిని ప్రశంసించారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో వీడియోను పంచుకుంటూ "డ్రిల్ బోధకుడికి హ్యాట్స్ ఆఫ్" అని రాశారు. చూడండి మీరు కూడా ఆ వీడియోను...
 

Hats Off to this Drill Instructor ..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు