వైసీపీ నేతలపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

శనివారం, 18 జనవరి 2020 (14:57 IST)
జనసేన, వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుండుసున్నా దేనితో కలిసినా... ఫలితం జీరోనే అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. దీనిపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. 
 
జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా... చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. ‘‘సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ ఇంత డెవలప్‌ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా... చదువుకున్న సన్నాసుల్లారా’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
అంబటి, అవంతి, పేర్ని నానిపైనా నాగబాబు సెటైర్లు వేశారు. వైసీపీ నేతల వల్ల ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ లేని లోటు తీరిందంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు